చిత్తూరు: దయ్యం పట్టిన తమ చిన్నకూతురికి పూజలు చేసి తగ్గించినట్టుగా నిందితులు  పోలీసులకు తెలిపారు. 

also read:పద్మజకు వదలని క్షుద్రపిచ్చి: కరోనా టెస్టుకు నో, నా శరీరం నుంచే...

చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితులైన తల్లిదండ్రులు పోలీసుల విచారణలో  కీలక విషయాలు వెల్లడించారు.నిందితులు వెల్లడించిన విషయాలను విన్న పోలీసులే నివ్వెరపోయారు. తమ ఇంట్లో కొన్ని రోజులుగా ఎన్నో మహిమలు జరిగినట్టుగా చెప్పారు. ఈ మహిమల గురించి మీకు చెప్పినా మీకు అర్ధం కాదన్నారు.

మా ఇంట్లో దేవుళ్లున్నారని పోలీసులకు నిందితులు వివరించారు. వారం రోజులుగా తమ ఇంటి ముందు ఎన్నో పూజలు చేసినట్టుగా నిందితులు చెప్పారు.10 రోజులుగా తిండి కూడ తినలేదన్నారు. కలియుగం అంతమైందని వారు చెప్పారు. అంతేకాదు సత్యయుగం కూడ మొదలైందని పోలీసులకు తెలిపారు.దయ్యం పట్టిన మా కూతుళ్లను డంబెల్స్ తో కొట్టి చంపామని పోలీసుల ముందు ఒప్పుకొన్నారు. చనిపోయిన తమ ఇద్దరు కూతుళ్లు మళ్లీ బతుకుతారని నిందితులు ఆకాంక్షను వ్యక్తం చేశారు.