Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ ది అడ్డుగోలు వాదనే

  • నంది అవార్డులు వివాదంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
public  reacting on lokesh for his remarks on nandi awards row

నంది అవార్డులు వివాదంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏపిలో ఓటుహక్కు, ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్ర ప్రాంతం వారికి ఆంధ్రాబాదీలు అనే పేరుని తెదేపా సోషల్ మీడియా కార్యకర్తలు బాగా ప్రచారం చేస్తున్నారు. నంది అవార్డులపై వివాదం రాగానే తెదేపా సోషల్ మీడియా సెల్ ఇదే వాదన తెరమీదకి తెచ్చింది. ఇప్పుడు లోకేష్ కూడా అదే మాట మాట్లాడారు.

లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో స్పందిస్తున్నారు. నంది అవార్డుల ప్రధానంలో ప్రభుత్వ నిర్వాకం గురించి ప్రశ్నేంచే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందంటున్నారు. ‘ఓటుకునోటు’ కేసు లో అడ్డంగా బుక్కై రాత్రికి రాత్రి హైదరాబాద్ ను వదిలి విజయవాడకు పారిపోయిన చంద్రబాబునాయుడు కుటుంబానికి ఆస్తులు ఎక్కడున్నాయంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ మరో ఏడేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలీదా అంటూ ధ్వజమెత్తుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఏపికి కి పరాయివాళ్ళా అంటూ మండిపడుతున్నారు.

నంది అవార్డులని 1964 నుంచి రాష్ట్ర ప్రభుత్వం  ఇస్తోందట. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ లో ఉండేదని గుర్తుచేస్తున్నారు. 1990 ల నాటికి గాని, తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాలేదన్నవిషయం చంద్రబాబుకు తెలీదా అంటూ మండిపడుతున్నారు. మద్రాసులో ఉన్న వాళ్ళకు నంది అవార్డులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడు కూడా అంతే అమరావతిలోనో విశాఖ లోనో చిత్ర పరిశ్రమ నిలబడడానికి టైం పడుతుందంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్నేళ్ళపాటు హైదరాబాద్ లో ఉంటున్నవారికే నంది అవార్డులు ఇవ్వకతప్పదని, అవార్డులకు ఓటుహక్కు, ఆధార్ కార్డే ప్రాతిపదికైతే నంది అవార్డులు ఇవ్వటం ఆపెయ్యాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్ లో ఉండి అక్కడే పన్నులు కట్టేవారికి ఆంధ్రతో ఏం పని అన్న లోకేష్ వ్యాఖ్యలకు స్పందించిన నెటిజన్లు ముందు హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందొ, వాళ్ళు ఎక్కడ పన్నులు కడుతున్నారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ లో కొత్తగా ఇల్లెందుకు కట్టుకున్నారో చెప్పాలన్నారు. కానీ మన రాజధాని అనుకుని హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపి వాళ్ళు ప్రభుత్వ నిర్వాకంపై  ఎందుకు మాట్లాడకూడదాంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios