Asianet News TeluguAsianet News Telugu

Nara lokesh : పిచ్చోడి పాలన ఫలితం...ప్రజారోగ్యం గాలిలో దీపం - టీడీపీ నాయకుడు నారా లోకేష్..

వైఎస్ జగన్ పాలనలో ఏపీలో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.

Public health is a lamp in the air during YS Jagan's rule - TDP leader Nara Lokesh..ISR
Author
First Published Nov 4, 2023, 3:53 PM IST

Nara lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ సవ్యంగా పని చేయడం లేదని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిందని ఆరోపించారు. విజయపురి సౌత్ కమ్యూనిటీ హాస్పిటల్ లో నెలకొన్న పరిస్థితితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

పొలిటికల్ రిటైర్మెంట్ పై మనసులో మాట బయటపెట్టిన వసుంధర రాజే.. కుమారుడి స్వీచ్ విన్న తరువాత కీలక వ్యాఖ్యలు..

ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో శనివారం పోస్టు పెట్టారు. ‘‘పిచ్చోడి పాలన ఫలితం...ప్రజారోగ్యం గాలిలో దీపం...! నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన రాష్ట్రప్రజలకు శాపమైంది... ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. నాగార్జునసాగర్ సమీపాన గల విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోంది. నల్లమల అటవీప్రాంతంలో గిరిజనతాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.’’ అని పేర్కొన్నారు.

ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఏడుగురు గల్లంతు..

‘‘రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే అల్లూరి సీతారామరాజు  జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడేదిక్కు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశాం.  జగన్ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాసుపత్రుల్లోనే దూది, గాజుగుడ్డ సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది.’’ అని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

పాత ట్విట్టర్ హ్యాండిల్స్ అమ్మాలని భావిస్తున్న ఎలాన్ మస్క్.. ధర తెలిస్తే షాకే..

‘‘రాష్ట్రంలో ఇంతదారుణమైన పరిస్థితులు కళ్లెదుట కన్పిస్తుంటే రాజుగారి వంటిమీద దేవతావస్త్రాల మాదిరిగా తమ హయాంలో వైద్య,ఆరోగ్యరంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్లవద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలి?!’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios