విశాఖపట్టణం: విశాఖపట్టణంలో  ఓ వ్యక్తి కత్తితో హల్ చల్ చేశాడు. ఓ మహిళతో పాటు చిన్నారిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో స్థానికులు సాక్ కు గురయ్యారు. కత్తితో స్థానికులను బెదిరించాడు. రోడ్డుపై హంగామా చేశాడు.

విశాఖపట్టణంలోని కొమ్మాదిలోని అమరావతి కాలనీలో సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. కొమ్మాదిలో కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రొడ్డుపై వెళ్తున్న మహిళను, చిన్నారిని తన చేతిలోని కత్తితో పొడిచాడు. దీంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై వెళ్తున్నవారిని ఆ వ్యక్తి కత్తితో బెదిరించాడు. సైకో ను స్థానికులు బంధించి చితకబాదారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.  సైకో దాడితో గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు.

కత్తితో ఆ వ్యక్తి ఎందుకు దాడికి దిగాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సైకో కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మహిళలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు.