అమరావతి: మాజీ డీజీపీ ఏఆర్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా సీఎం జగన్ నివాసం వద్ద కొందరు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై తప్పుడు కేసులు బనాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ఆయన మెప్పు కోసం డీజపీ తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు.తప్పుడు కేసులతో తమను ఇబ్బందులకు గురి చేశారని  బాధితులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు.ఏసీబీలో ఇంకా ఠాకూర్ హవా కొనసాగుతోందని  నిరసనకారరులు ఆరోపిస్తున్నారు.

తమపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని  బాధితులు డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు బనాయించిన మాజీ డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.