అమెరికాలో బీజేపీ ఎంపీకి హోదా సెగ

protest against bjp mp in americe over special status
Highlights

బీజేపీ ఎంపీకి చుక్కలు చూపించిన ప్రవాసాంధ్రులు

బీజేపీ ఎమ్మెల్యేకి అమెరికాలో చుక్కెదురైంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఉద్యమం కొనసాగుతున్న వేళ బీజేపీ ఎంపీలు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడంలేదు. తాజాగా అమెరికా న్యూజెర్సీలో పర్యటిస్తున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావుకు ప్రవాసాంధ్రుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

కర్ణాటక విజయాన్ని పురస్కరించుకుని ఎన్నారై బీజేపీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న నర్సింహారావుపై ప్రవాసాంధ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేశారంటూ మండిపడ్డారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని జీవీఎల్‌ చెప్పగా.. తెలుగువారు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలకు ముందు హోదా అంటూ మోదీనే ప్రకటనలు చేశారని.. ఇప్పుడు ఇలా మాట మారుస్తారా? నిలదీశారు. ఈ క్రమంలో బీజేపీ సానుభూతిపరులు, ప్రవాసాంధ్రుల పోటాపోటీ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.

loader