చెడ్డీగ్యాంగ్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు...
తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించిన నలుగురు దొంగలను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో cheddi gang ఇటీవల కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేసింది చెడ్డీ గ్యాంగ్. దీంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. తాజాగా ఈ కేసులో పురోగతి సాధించారు. రెండు gangsకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల CCTV footageని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను Gujarat పోలీసులు గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. గుజరాత్‌లోని Dahod regionనికి చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించిన నలుగురు దొంగలను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 11న విజయవాడ నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్న cheddi gang కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని Gunadala, Madhuranagar Railway Station ప్రాంతాలను డిసెంబర్ 10న ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో చెడ్డీగ్యాంగ్ lock వేసిన ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్ లలో దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్న రని.. దీని వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని అన్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.... కరుడుగట్టిన ముఠా సభ్యులు వీళ్లే
దక్షిణాది రాష్ట్రాల్లోనే దోపిడీలు : gujarat రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డి గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, kerala రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని అని వివరించారు.
రైల్వే స్టేషన్ లే వీరి జాగాలు : రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడే చెడ్డి గ్యాంగ్ సభ్యులు పగటిపూట యాత్రికులుగా నటిస్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చి పోయే ప్రయాణికుల్లా రైల్వేస్టేషన్లలో ఉంటారు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకుల్లా నటిస్తూ, మోసం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దోపిడీలు పూర్తయిన తర్వాత వీరు రైలు మార్గాల ద్వారానే వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారని పోలీస్ కమిషనర్ వివరించారు. సాధారణంగా వీరు అర్ధరాత్రి 1-4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంటారని చెప్పారు.
దాడులు చేయరు : చెడ్డి గ్యాంగ్ దోపిడీకి అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడతారని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనకాడరని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవి నమ్మదగినది కాదని సీపీ స్పష్టం చేశారు. గత పది రోజుల వ్యవధిలో నగరంలో మూడు చోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడ్డారని, ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారని, అయితే ఆయా ఘటనలో ఎవరి పైనా దాడి చేయలేదని అన్నారు.