కడప: తెలుగుదేశం పార్టీ నందం సుబ్బయ్య హత్యతో సంబంధముందంటూ వస్తున్న ఆరోపణలపై ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ రాధ స్పందించారు. ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.  సుబ్బయ్య తనను కలవడానికి వచ్చిన మాట నిజమేనని...  బిజీగా వుండటంతో కాస్సేపు ఆగమని చెప్పానన్నారు. అతడి హత్య జరిగిన సమయంలో తాను హోమంలో ఉన్నానని అన్నారు. కానీ అతడి కుటుంబసభ్యులు కావాలనే తనపై ఈ హత్యతో సంబంధాన్ని అంటగడుతున్నారని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... ఏ విచారణకైనా సిద్దమని కమీషనర్ రాధ తెలిపారు.

ఈ నెల 29వ తేదీన ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యపై  వైఎస్ఆర్‌సీపీపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది.ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై  సుబ్బయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే సుబ్బయ్య హత్యకు గురికావడం ప్రొద్దుటూరులో రాజకీయంగా కలకలం రేపుతోంది.

read more  సుబ్బయ్య హత్యా నేరం టీడీపీదే.. లోకేష్ కొవ్వుతో పాటు, మదం కూడా తగ్గించుకో.. పేర్నినాని..

తన భర్త హత్యకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన బావమరిది మునిరెడ్డి, ప్రొద్దుటూరు పురపాలిక కమిషనర్‌ రాధ  కారణమని మృతుడి భార్య ఆరోపించారు.ఈ మేరకు ఆమె పోలీసులకు  చేసిన ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొంది.

 ఇళ్ల పట్టాలను పంపీణీ చేసే స్థలంలోనే సుబ్బయ్యను హత్యకు గురయ్యాడు. కళ్లలో కారం కొట్టి సుబ్బయ్యను నరికి చంపారు.  సుబ్బయ్య మొబైల్ ఫోన్ కన్పించడం లేదు.హత్య జరిగిన స్థలానికి సుబ్బయ్య ఎందుకు వెళ్లాడు... ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారనే విషయమై విచారణ చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన బావ మరిది, కమీషనర్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చాలని ఆమె కోరుతున్నారు.