ప్రొద్దుటూరుకు చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ లకు ఎంపికయ్యింది. ఈ సెలెక్షన్స్ లో మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. 

ప్రొద్దుటూరు : ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లి గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి అనే క్రీడాకారిణి త్వరలో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ. వీరిది కానపల్లె గ్రామం. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాటిస్తున్నారు. కూతురికి చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతిలోనే కడపలోని వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ లో చేర్పించారు. స్కూల్ తర్వాత నెల్లూరు షాప్ అకాడమీలో ఉంటూ శ్రీదేవి ఇంటర్ పూర్తి చేసింది.

ప్రస్తుతం శ్రీదేవి డిగ్రీ చదువుతోంది. ఫుట్బాల్ పై చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం. దీంతో శ్రీదేవి ఎన్నో పోటీల్లో పాల్గొనేది. విజేతగా నిలిచేది. అలా.. అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్ లోనూ, కటక్ లో జరిగిన జూనియర్ క్యాంప్ లోనూ, గుంటూరులో జరిగిన ఎస్జిఎఫ్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది. బహుమతులు సాధించింది. మహారాష్ట్రలోని నాగపూర్ లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఈ నెల రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఇండియా ఫుట్బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపికయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వజ్జల శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచింది. శ్రీదేవికి కోచ్ కె. సాయికిరణ్.

జనసేన ఫ్లెక్సీలో ఆమంచి సోదరుడి ఫొటో..! పార్టీ మారతాడంటూ ఊహానాగాలు.. !!

హోం లెస్ వరల్డ్ కప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా.. హోమ్ లెస్ వరల్డ్ కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. . ఇది ఈ ఫౌండేషన్ నిర్వహించే వార్షిక అసోసియేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఫుట్బాల్ ఆటతో నిరాశ్రయులు లేకుండా చేయాలని పనిచేసే ఈ అసోసియేషన్ ఒక సామాజిక సంస్థ. ఈ సంస్థ ఫుట్బాల్ టోర్నమెంట్లను యేటా నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో నిరాశ్రయులైన వ్యక్తుల జట్లు వివిధ దేశాల నుంచి పాల్గొంటాయి.

2001లో మెల్ యంగ్, హెర్మాల్డ్ ష్మీడ్ అనే ఇద్దరు ఈ హొంలెస్ ప్రపంచ కప్ సంస్థను స్థాపించారు. 2003లో ఆస్ట్రేలియాలోని గ్రాజ్ లో రాష్ట్రాల కోసం మొదటి వార్షిక ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగింది. 2019 ఎడిషన్ నువేల్స్ కార్డులోని బ్యూట్ పార్కులో నిర్వహించారు. ఆ తరువాత 2020 టోర్నమెంట్ ఫిన్లాండ్లోని టాంపేర్ లో జరగాలి. అయితే అదే సంవత్సరం కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించిన నేపథ్యంలో ఇది రద్దయింది.

 ఆ తర్వాత ఇప్పుడు 2023 ఏప్రిల్ లో ఈ టోర్నమెంట్లను నిర్వహించాలని నిర్ణయించారు. ఇది యూఎస్ఏ లోని కాలిఫోర్నియాలో జరగనున్నాయి. స్కాట్లాండ్లోని ఎడిన్ బర్గ్ లోని ఈస్ట్ రోడ్ స్టేడియంలో హోమ్ లెస్ వరల్డ్ కప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉంది.