వైసిసి నగరి  ఎమ్మెల్యే రోజాను కొత్త అసెంబ్లీలో కాలు పెట్టకుండాచేసేందుకు రంగం సిద్ధమయింది.

ఆమె సస్పెన్షన్ ను మరొక  ఏడాది  పొడిగించాలని  ప్రివిలేజెస్ కమిటీ అభిప్రాయపడింది.

రోజా సభలో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీకి నివేదించింది.

 ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేసింతర్వాత కమిటీ ఈ రోజు తన నివేదికను స్పీకర్ కు సమర్పిచింది.

బయటకు పొక్కిన సమాచారం ప్రకారం, రోజాను మరొక ఏడాది పాటు  ఆమెను సభనుంచి బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

విచారణ సమయంలో రోజా పొంతన లేని వాదనలు వినిపించారని కమిటీ అభిప్రాయ పడింది.

గతంలో అసెంబ్లీ రోజా ను 2016 చివరి దాకా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఎప్పటినుంచి ఈ సస్పెన్షన్ అమలులోకి వస్తుందనే విషయాన్ని అసెం బ్లీ నిర్ణయిస్తుందని కమిటీ తెలిపింది.

రోజా ‘అనుచిత’ ప్రవర్తన మీద గతంలో ఎమ్మెల్య గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఉన్న కమిటీ ఆమె గత ఏడాది  డిసెంబర్  15 నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పింది.

సభలో చర్చ, కోర్టు వివాదం తర్వాత కమిటీ ముందు హాజర య్యుందుకు అమె కు  మరొక అవకాశం కల్పించాలని  నిర్ణయించారు.

అయితే, కమిటీ ముందు హాజరయినా, బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు  ఆమె సిద్ధంగా లేరని కమిటీ తన 62 పేజీల నివేదికలో పేర్కొంది.