ఇవాళ ఉదయం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వేగంగా దూసుకెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పొలాాల్లోకి దూసుకెళ్లింది.

కడప : హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ యాక్సిడెంట్ లో 17మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. ఇవాళ ఉదయం కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న బస్సు అదుపుతప్పింది. దీంతో రోడ్డుపై నుండి కిందకుదిగిన బస్సు పొలాల్లోకి వెళ్ళి ఆగింది. బస్సు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Reda More బైక్‌పై స్టంట్లు చేస్తూ యువతి డ్రైవింగ్ .. షాకిచ్చిన బెజవాడ పోలీసులు, ఏం చేశారంటే..?

ప్రమాదం కారణంగా బస్సు డోర్స్ లాక్ అయిపోయి ప్రయాణికులు కొద్దిసేపు బయటకు రాలేకపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ముందుభాగంగా అద్దాలు పగిలిపోగా అందులోంచి ప్రయాణికులు బయటకు తీసుకువచ్చారు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడగా మరో 15మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన మహిళలకు అంబులెన్స్ లో దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు.... ఓ మహిళకు కాలు విరిగినట్లు తెలుస్తోంది. 

వీడియో

ప్రమాద సమయంలో బస్సులో 17 మంది వున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మరో 15మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుడిపాడు గ్రామస్తులు ప్రమాదం జరగ్గానే బస్సువద్దకు వచ్చి ఇరుక్కుపోయిన ప్రయాణికులు బయటకు తీసుకువచ్చారు.