మెరిసిన తెలుగు "తేజం": కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు...

మెరిసిన తెలుగు "తేజం": కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు...

విజయవాడ: సివిల్స్ లో అఖిల భారత స్థాయిలో తెలుగు అభ్యర్థులు తమ సత్తా చాటారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన ఇమ్మడి పృథ్వీ తేజ్ తొలి ప్రయత్నంలోనే ఐఎస్ఎస్ కు ఎంపికయ్యాడు. 

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆయన 24వ ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి శ్రీనివాసరావు వ్యాపారి. తల్లి రాణి గృహిణి. పృథ్వీ 3వ తరగతి వరకు ద్వారకా తిరుమల మండలంలోని రాళ్లకుంట సెంట్ కెవిఆర్ పాఠశాలలో చదివాడు. 7 నుంచి పదో తరగతి వరకు గుడివాడ విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసించాడు. 

గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ 2011లో ఐఐటిలో అఖిల భారత స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఆ తర్వాత ఐఐటి ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన శ్యాంసంగ్ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం చేశాడు.సివిల్ సర్వీసెస్ కు ఆయన కోచింగ్ కూడా తీసుకోలేదు. 

అనంతపురానికి చెందిన భార్గవ్ తేజ 88 ర్యాంకు సాధించాడు. ఎ. వెంకటేశులు, పద్మజ దంపతుల కుమారుడు. నిరుడు తొలి ప్రయత్నంలో తేజ ఐఆర్ఎస్ కు ఎంపికయ్యాడు. నాగపూర్ లో శిక్షణ తీసుకుంటూ రెండోసారి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశాడు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos