ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని మోడీ ఇవాళ ప్రారంభించారు.
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థనే నాసిన్ అని పిలుస్తారు.
రూ. 541 కోట్లతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2015లో నాసిన్ కు శంకుస్థాపన చేశారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంస్థను ప్రారంభించారు.నాసిన్ శిక్షణ కేంద్రంపై లఘు చిత్రాన్ని అధికారులు ప్రదర్శించారు. నాసిన్ అనేది అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం.అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధికారులకు నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు.503 ఎకరాల విస్తీర్ణంలో నాసిన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు. నాసిన్ ఆవరణలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి కూడ కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. నాసిన్ వద్ద కేంద్రీయ విద్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రికి కూడ స్థలాలను ఎంపిక చేశారు.
