నంద్యాల జిల్లా వైఎస్ ఆర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమసంబంధాన్ని ప్రశ్నించిందని ఓ గర్భిణిని పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...

హైదరాబాద్ కు చెందిన లక్ష్మి నిండు గర్బిణి. కాన్పుకోసం నంద్యాలలోని తల్లిగారింటికి వెళ్లింది. అక్కడ తన తండ్రి వెంకట్రాయుడు అదే వీధిలో ఉంటున్న సుశీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో సుశీలను ప్రశ్నించింది లక్ష్మి. 

దీంతో కోపానికి వచ్చిన సుశీల..లక్ష్మిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచింది. దీంతో విపరీతంగా రక్తస్రావం అవ్వడంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. గతరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వెంకట్రాయుడికి ఇద్దరు కూతుర్లు లక్ష్మి చిన్న కూతురు. ఇదివరకు కూడా ఇదే విషయంలో పెద్ద కూతురు కూడా సుశీలతో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

గర్భిణి, కడుపులోని శిశువు మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.