ఆ డిమాండ్లు అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలు: తేల్చేసిన ఉద్యోగ సంఘాలు

ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వడంతో పాటు, జనవరి నెలకు పాత జీతాలను ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ ప్రకటించారు.

PRC Struggle Committee Demands to give Ashutosh Mishra committee report

అమరావతి: Strike  నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయని అనుకోలేదని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ చెప్పారు.తమ రెండు డిమాండ్లను అంగీకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.

GAD ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత పీఆర్సీ సాధన సమితి నాయకులు సోమవారం నాడు సచివాలయం మీడియా పాయింట్ లో పీఆర్సీ సాధన సమితి నేత Suryanarayana మీడియాతో మాట్లాడారు.

 తమతో చర్చలకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్ర ప్రభుత్వ సలహదారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసిన విషయమై తాము  మీడియాలో చూసి తెలుసుకొన్నామన్నారు.   ఈ విషయమై తాము ఈ కమిటీ అధికార పరిధి గురించి తాము ప్రశ్నించామన్నారు. దీంతో ఇవాళ ఈ కమిటీ నియామకం గురించి ప్రభుత్వం జీవోను ఇచ్చిందని సూర్యనారాయణ జీవో కాపీని మీడియాకు చూపించారు. 

PRCపై ఏర్పాటు చేసిన Ashutosh Mishra కమిటీ నివేదిక ఇవ్వడంతో  జనవరి నెలకు పాత జీతాన్ని ఇస్తేనే ఈ కమిటీతో చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన సమితి  నేత సూర్యనారాయణ తేల్చి చెప్పారు.అన్ని విషయాలపై చర్చించిన మీదటే తాము సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. సీఎస్ Sameer Sharma ఢిల్లీకి వెళ్లినందున జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ Shashibushan కు నోటీసు ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో తాము జీఏడీ సెక్రటరీకి నోటీసును ఇచ్చామన్నారు.

 కొత్త జీతాలు ఇచ్చేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని పీఆర్సీ సాధన సమితి నేత Bandi Srinivasa Rao ప్రశ్నించారు.తమతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడ సమ్మెలోకి వస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆయన సూచించారు.

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పీఆర్సీ సాధన సమితి నేత Venkatrami Reddy కోరారు. మంత్రుల కమిటీ కూడా ఈ విషయమై  సానుకూలంగా స్పందించాలని కోరారు.పీఆర్సీ జీవోలు ఇచ్చిన తర్వాత తమతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఏనాడైనా జరిగిందా అని పీఆర్సీ సాధన సమితి నేత Bopparaju Venkateshwarlu ప్రశ్నించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios