హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గానీ, వైఎస్ జగన్ కు గానీ ఇద్దరికీ నిజాయితీ, సమర్ధత రెండు లక్షణాలు లేవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఓప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే  నిజాయితీ, సమర్థత కలిగిన నాయకులు అవసరమన్నారు. ఆ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎంతో అభివృద్ధి చెందుతామన్నారు. 

ప్రస్తుత రాజకీయాల్లో ఏపీలో అలాంటి లక్షణాలున్న నాయకుడు ఒక్కరూ లేరన్నారు. అయితే చంద్రబాబు, జగన్ లలో చెరోకటి ఉండొచ్చేమో కానీ రెండు లక్షణాలు మాత్రం లేవన్నారు. జగన్ లో  కానీ, చంద్రబాబులో  కానీ నిజాయితీ, సమర్థత రెండు లక్షణాలు లేవని ఒక్కోటిమాత్రమే ఉన్నాయన్నారు. తాను, ప్రజలు కోరుకునేది రెండు లక్షణాలు కలిగిన నాయకుడని చెప్పుకొచ్చారు. అలాంటి లక్షణాలున్న నాయకుడికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పుకొచ్చారు.   

ఈ వార్తలు కూడా చదువండి

వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని

జగన్ పై చేసేవి ఆరోపణలు మాత్రమే, ఆయన జెన్యూన్ పర్సన్: పోసాని