హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడుంటూ వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలు మాత్రమేనని సినీనటుడు పోసాని కృష్ణ మురళీ ఆరోపించారు. జగన్ అవినీతి పరుడంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని అయితే వాటిలో ఏ ఒక్కటి అయినా నిరూపించగలిగారా అంటూ ప్రశ్నించారు. 

రాజకీయాల్లో అలాంటి కేసులు సహజమేనని అయితే త్వరలో వాటిపై కూడా క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్ జెన్యూన్ పర్సన్ లా తనకు కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 2014కు ముందు ఎలాగో ఉన్నాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా పరిణితి చెందాడని చెప్పుకొచ్చారు. 

జగన్ స్పీచ్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని అతని వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తాను ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించానని, అలాగే చంద్రబాబు నాయుడు పనితీరును కూడా మెచ్చుకున్నానని గుర్తు చేశారు. అలాగని తాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. 

ప్రస్తుత రాజకీయాల్లో జగన్ తనకు మంచి నాయకుడిలా కనబడుతున్నాడని నటుడు పోసాని తెలిపారు. ఇకపోతే పోసాని కృష్ణ మురళీ గత కొంతకాలంగా వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో పోసాని ఆయన్ను కలిశారు. జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పార్టీలో మాత్రం చేరలేదు. భవిష్యత్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని