Asianet News TeluguAsianet News Telugu

కాల్పులు జరిపిన బాలకృష్ణ శిక్ష పడకుండా బయటే ఉన్నాడు.. అడ్డదారులు తొక్కింది ఎవరు?: పోసాని

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు.

Posani Krishna murali Sensational comments on chandrababu balakrishna ramoji rao ksm
Author
First Published Sep 16, 2023, 4:36 PM IST

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. పోసాని కృష్ణ మురళి శనివారం  మీడియాతో మాట్లాడుతూ.. రామోజీ రావు ఆయన పేపర్‌తో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోతే రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండటంతోనే సెలవుపై వెళ్లారని చెప్పారు. రామోజీరావు చనిపోతే అతని కుమారుడు కిరణ్ వెళ్లడా? అని ప్రశ్నించారు. 

రాహుల్ సెలవుపై వెళ్లడంతో జైలుకుకొత్త అధికారి వస్తే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువు అని.. అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా వచ్చిన అధికారి రవి కిరణ్‌కు ఎలాంటి బ్యాడ్ హిస్టరీ లేదని  అన్నారు. ఎవరూ ఎన్ని దుష్ప్రచారాలు చేసిన, కుళ్లు రాతలు రాసినా, చేతబడులు  చేసినా.. ప్రజలు జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. ప్రజలను జగన్ మనుషులుగా చూస్తారని.. ఓటర్‌గా చూడరని అన్నారు. 

చంద్రబాబును  జైలులో కలిసిన ఆయన సతీమణి భువనేశ్వరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె భర్త ప్రజల కోసమే పనిచేశారని చెప్పారని అన్నారు. అయితే చంద్రబాబు  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరింది ప్రజల కోసమేనా?, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులు పంపింది ప్రజల కోసమేనా? అని  ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి చేయించింది, అక్రమంగా అధికారం లాక్కుంది చంద్రబాబు  అని గుర్తులేదా? అని ప్రశ్నించారు. మాజీ ఉన్నతాధికారి పీవీ రమేష్ బ్రోకర్.. మీడియా ముందుకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన వాటి గురించి పీవీ రమేష్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

నందమూరి బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కాల్చినట్టుగా కాల్చిపారేశాడని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. వారు బుల్లెట్స్ దిగి చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. పోలీసు స్టేషన్‌లో ఉండాల్సిన బాలకృష్ణ.. కానీ బాలకృష్ణకు ఎందుకు శిక్ష పడలేదని  ప్రశ్నించారు. తుపాకీతో కాల్పులు జరిపి కూడా బాలకృష్ణ శిక్ష పడకుండా ఉన్నారని అన్నారు. ఇవన్నీ పీవీ రమేష్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. మరి అడ్డదారులు తొక్కింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయం అంతా ఉపయోగించి బాలకృష్ణను బయటకు తీసుకొచ్చారని  ఆరోపించారు. చంద్రబాబు అనే వ్యక్తి అవినీతి పరుడని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios