చంద్రబాబునూ వివాదంలోకి లాగిన లోకేష్

చంద్రబాబునూ వివాదంలోకి లాగిన లోకేష్

నారాలోకేష్ తన అపరిపక్వతతో తాను ఇరుక్కోవటమే కాకుండా చంద్రబాబునాయుడును కూడా వివాదాల్లోకి లాగేసారు. ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయం ఎంతగా వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. వివాదం ఒక్క సినిమా ఫీల్డ్ కు మాత్రమే ఆగకుండా సామాజికవర్గాల పరంగా కంపు రేగింది. అటువంటి వివాదంలోకి తగుదునమ్మా అంటూ నారా లోకేష్ వేలు పెట్టారు. వేలు పెట్టన వాడు ఏమన్నా జాగ్రత్తగా మాట్లాడా అంటే అదీ లేదు.

అనవసరంగా నోటికొచ్చింది మాట్లాడి కంపు చేశాడు. ఆధార్ కార్డని, ఓటరు కార్డని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. దాని పర్యవసానమే పోసాని కృష్ణమురళి మంగళవారం ఫైర్ అయ్యింది.  పోసాని ఫైర్ అయిన విధానమే చెబుతోంది ఎంతమందికి చంద్రబాబు ప్రభుత్వంపై మండుతున్నారు. అటువంటి వివాదంలో లోకేష్ మాట్లాడిన మాటలతో చివరకు చంద్రబాబు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్ధితి వచ్చేసింది. అనవసరంగా లోకేష్ మాట్లాడిన మాటలతో పోసాని చంద్రబాబు ఆస్తులు, వ్యాపారాల గురించి వేసిన ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.  జనాలకు కూడా పోసాని వాదనకే మద్దతుగా మాట్లాడుకుంటున్నారు. లోకేష్ తాజా నిర్వాకంతో చంద్రబాబు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్ధితిలోకి జారిపోయారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page