ఏపీలో ఫేక్ లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.. పూనమ్ కౌర్ మరో సంచలనం
ఏపీ రాజకీయాలపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో కొందరు ఫేక్ లీడర్లు ఉన్నారని, వారి అవసరానికి, సానుకూలతలకు అనుగుణంగా మాట్లాడుతారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె ట్వీట్ చేశారు. నిజంగానే మహిళలపట్ల సానుభూతి ఉన్నట్టు నటిస్తారని పేర్కొన్నారు.

ప్రముఖ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలనం రేపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆమె ఒక స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. ఓ నాయకుడిని టార్గెట్ చేసుకుని పేరు ప్రస్తావించకుండా వాగ్బాణం విడిచారు. సహజంగానే ఆమె ట్రోలింగ్‌కు గురయ్యారు.
నిజంగా మహిళల పట్ల నిజంగా సానుభూతి కలిగి ఉన్నట్టే.. కొందరు తమ గొంతు చించుకుని మహిళల సమస్యల గురించి అరుస్తున్నారని ట్వీట్ చేశారు. నిజానికి వారు ఢిల్లీలో మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళనలు చేసినా ఒక్క మాట మాట్లాడలేదని పేర్కొన్నారు. వారికి ప్రయోజనంగా అనిపించినప్పుడే, వారికి సానుకూలంగా ఉన్నప్పుడే ఇలా మాట్లాడే కొందరు ఫేక్ లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
ఈమె ట్వీట్ చేయగానే.. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకుని ఉన్న కొందరు ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించేనని వారు భావిస్తూ కామెంట్లు చేశారు. కొందరు ఆమెను ట్రోల్ చేయగా.. మరికొందరు సపోర్ట్ చేశారు. పవన్ అభిమానులు, వైసీపీ అభిమానులు ట్వీట్లు చేసుకున్నట్టుగా అవి కనిపించాయి.
Also Read: సీఐ అంజూ యాదవ్‌పై తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు.. ఎస్పీ కార్యాలయానికి భారీగా జనసైనికులు..
ఏపీ రాజకీయాల్లో మహిళల చుట్టూ కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు సంధిస్తూ ఏపీ నుంచి మహిళలు మిస్ అవుతున్నారని కేంద్రంలోని నిఘా వర్గాలు తనకు చెప్పాయని పేర్కొన్నారు. తాను మహిళ భద్రత గురించి ఆందోళన చెందతున్నట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి.