నెల్లూరు జిల్లాలో ఓ పోలింగ్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. బ్యాలెట్ పేపర్లను పోలింగ్ కేంద్రం బయటకి తీసుకొచ్చారు. అంతేకాకుండా వాటిని ఓటర్ల దగ్గరకు తీసుకెళ్లి ఓట్లు వేయించారు.

ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. సీతారామాపురం మండలం బాలాయపల్లి పంచాయతీలోని అంకిరెడ్డి పల్లిలో ఈ ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లు కావడంతోనే పోలింగ్ ఆఫీసర్ ఇలా చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ శాతం క్రమేసీ పెరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌ నమోదయిందన్నారు.

9 వేల పోలింగ్‌ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో  స్వల్ప సమస్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు.