Asianet News TeluguAsianet News Telugu

హత్యకు రెక్కీ.. హీటెక్కిన బెజవాడ, రాజకీయమంతా ‘‘ వంగవీటి రాధా’’ చుట్టూనే

వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) చుట్టూ బెజవాడ రాజకీయం తిరుగుతోంది. తన హత్యకు కుట్ర చేశారన్న రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించినా ఆయన వెనక్కి తిప్పిపంపారు. అయితే గన్‌మెన్‌లను తీసుకోవాలా వద్దా  అన్నది రాధా వ్యక్తిగత విషయమని ఏపీ మంత్రులు చెబుతున్నారు

political heat in vijayawada over vangaveeti radha assassination conspiracy
Author
Vijayawada, First Published Dec 29, 2021, 6:19 PM IST

వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) చుట్టూ బెజవాడ రాజకీయం తిరుగుతోంది. తన హత్యకు కుట్ర చేశారన్న రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించినా ఆయన వెనక్కి తిప్పిపంపారు. అయితే గన్‌మెన్‌లను తీసుకోవాలా వద్దా  అన్నది రాధా వ్యక్తిగత విషయమని ఏపీ మంత్రులు చెబుతున్నారు. మరోవైపు రాధా హత్యకు రెక్కీ నిర్వహించింది ఎవరా అన్నదానిని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఈ క్రమంలోనే కార్పోరేటర్ అరవ సత్యంను విచారించారు. ఇటు చంద్రబాబు సైతం ఏపీ డీజీపీ (ap dgp) గౌతం సవాంగ్‌కు (gautam sawang) లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

రెక్కీ నిర్వహించిన ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని చంద్రబాబు చెప్పారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని ఆయన అన్నారు. వంగవీటి రాధాకు వరుసగా బెదిరింపులు రావడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. దర్యాప్తును పారదర్శకంగా జరిపి నిందితులను శిక్షించాలని ఆయన డీజీపీని కోరారు. 

ALso Read:ప్రాణాలకు ముప్పు: వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్, ప్రభుత్వానిదే బాధ్యత

చట్టవ్యతిరేకమైన, హింసాత్మక సంఘటనలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని చంద్రబాబు (chandrababu naidu) అన్నారు. రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తోందని, విచారణ జరిపి నిందితులను శిక్షిస్తేనే ప్రాథమిక హక్కులను పరిరక్షించగలుగుతారని ఆయన అన్నారు. అనవసరమైన ప్రభావాలకు లోను కాకుండా, సత్వర పారదర్శక విచారణ జరిపి వంగవీటి రాధాపై దాడికి రెక్కీ నిర్వహించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

ఇదిలా ఉండగా, వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బెజవాడకు చెందని కొందరు అనుమానితులపై పోలీసులు దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో arava sathyam స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలో అరవ సత్యం కొడుకు చరణ్ మీడియా ముందుకు వచ్చాడు. 

నిన్నటి నుంచి తన తండ్రి ఆరోగ్యం బాలేదని.. గతంలో సర్జరీ జరిగిందని అతను చెప్పాడు. హై బీపీతో నేరుగా ఆసుపత్రికి వచ్చారని.. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో వుండాలనన్నారని చరణ్ తెలిపాడు.  రెక్కీ నిర్వహించారని బురద జల్లారని.. ఏ కస్టడీకి మా నాన్నను ఎవరూ తీసుకెళ్లలేదని ఆయన స్పష్టం చేశాడు. తమకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవని.. దీనిని ఎటువంటి వివాదం చేయవద్దని చరణ్ విజ్ఞప్తి చేశాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios