Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్ తో ఎస్సై ప్రేమవివాహం.. ఆ తరువాత వేధింపులు...

నెల్లూరులో ఓ ఎస్సై వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళా కానిస్టేబుల్ ను కట్నం తెమ్మంటూ కుటుంబసభ్యులతో కలిసి వేధించాడు.

policeman dowry harassment to wife, case registered in nellore
Author
First Published Oct 7, 2022, 6:44 AM IST

నెల్లూరు : నెల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకుని.. భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు..  వేదాయపాలెం ఎస్సైగా షేక్  మెహబూబ్ సుభాని పనిచేస్తున్నాడు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్ గా ఉన్న ఓ యువతిని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. 

ఇదే విషయమై గత నెల 9వ తేదీన ఆమె మీద భర్త, అత్త దాడి చేశారు. ఈ క్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లి పోయాడు. బాధితురాలు గత నెల 28న దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబ సభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ కేసుపై గోప్యంగా విచారణ చేపట్టారు.

పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టండి... సూర్యలంక బీచ్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఇదిలా ఉండగా, గత నెల పదిన చెన్నైలో ఇలాంటి ఘోరమైన ఘటనే వెలుగు చూసింది. చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని  పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళకు ఒక కుమార్తె కూడా ఉంది. 

ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై  సబ్ ఇన్స్పెక్టర్ కనపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సుమారు ఏడేళ్లుగా బాలికపై ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు. ఇటీవలే మరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చిన సమయంలో యువతికి తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

పార్లమెంట్ స్టాండింగ్‌ కమిటీల్లో టీఆర్‌ఎస్‌కు కేంద్రం షాక్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ ఎంపీలు..

అతని వేధింపులు భరించలేక, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధింపులకు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమెకు మరొకరితో వివాహమైనప్పటికీ లైంగిక వేధింపులు ఆపలేదని, దీంతో సబ్ ఇన్స్పెక్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios