Asianet News TeluguAsianet News Telugu

పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టండి... సూర్యలంక బీచ్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో యువకులు గల్లంతై ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ అధినేత , ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటక ప్రదేశాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

tdp chief chandrababu naidu response on suryalanka beach tragedy
Author
First Published Oct 6, 2022, 4:02 PM IST

బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో యువకులు గల్లంతై ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ అధినేత , ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీచ్‌లో విహారానికి వెళ్లిన యువకులు మృతి చెందడం తనను కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని చంద్రబాబు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read:బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. కనిపించకుండా పోయిన మరో నలుగురు..

కాగా... విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన విద్యార్ధులు విహారయాత్ర నిమిత్తం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్ధులు సముద్రంలో గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరు విద్యార్ధులను రక్షించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios