విశాఖపట్టణం: విశాఖపట్టణం జుత్తూరులో పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.  పాత కక్షలను దృష్టిలో ఉంచుకొనే  విజయ్ కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

విజయ్, అప్పలరాజుకు మధ్య పాతకక్షలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పలరాజు కూతురితో  విజయ్ ప్రేమ వ్యవహరం నడిపడంతోనే వివాదం మొదలైందనే ప్రచారం సాగుతోంది.ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయమై 2018లో విజయ్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో  అప్పలరాజు కేసు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు.

also read:విశాఖలో ఆరుగురి హత్య: ఆ ఇంట్లో ఎవ్వరినీ వదలను.. మృతుడి కుమారుడు తీవ్ర వ్యాఖ్యలు

ప్రస్తుతం విజయ్  విజయవాడలో ఉంటున్నాడు.  ఈ ఫంక్షన్ నిమిత్తం విజయ్ కుటుంబసభ్యులు విశాఖపట్టణం విషయాన్ని గుర్తించిన అప్పలరాజు  గురువారం నాడు తెల్లవారుజామున అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇవాళ ఉదయం  ఆరు మృతదేహాలకు కేజీహెచ్ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాత  మృతదేమాలకు కుటుంబసభ్యులకు అందించనున్నారు.