విశాఖలో ఆరుగురి హత్య: ఆ ఇంట్లో ఎవ్వరినీ వదలను.. మృతుడి కుమారుడు తీవ్ర వ్యాఖ్యలు
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను హత్య చేసిన ఘటన చోటు చేసుకున్న విశాఖ జిల్లా జుత్తాడలో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి కుమారుడు విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనని కేకలు వేశాడు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను హత్య చేసిన ఘటన చోటు చేసుకున్న విశాఖ జిల్లా జుత్తాడలో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి కుమారుడు విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
తన కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనని కేకలు వేశాడు. అక్కడితో ఆగకుండా నిందితుడి ఇంటిపై దాడికి ప్రయత్నించాడు. పోలీసులు భారీగా మోహరించి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు.
తన భార్యాపిల్లలు చనిపోయిన ఆ ఇల్లు తనకు శ్మశానంతో సమానమని అప్పలరాజు కుటుంబాన్ని అంతమొందిస్తానని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా గొడవుంటే తనతో పెట్టుకోవాలని గాని.. తన కుటుంబాన్ని నాశనం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read:విశాఖలో ఆరుగురి హత్య: ఘటనాస్థలిలోనే మృతదేహాలు, కలెక్టర్ రాక కోసం ఆందోళన
కాగా, పెందుర్తి మండలం జుత్తాడలో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై పొరుగునే ఉండే అప్పలరాజు కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్(2), బొమ్మిడి ఉర్విష(8 నెలలు)గా గుర్తించారు.
ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీన్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జుత్తాడ ఉలిక్కిపడింది.. చనిపోయిన వారిలో చిన్నారుల కూడా ఉండటం స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది.