శ్రీకాళహస్తి హత్య మిస్టరీ: భర్తతో కలిసి ప్రియుడిని చంపిన మహిళ

Police solve srikalahasti Murder Mystery
Highlights

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పదిరోజుల క్రితం జరిగిన హత్యా మిస్టరీని పోలీసులు చేదించారు. ఈ హత్యకు అక్రమ సంబందమే కారణంగా గుర్తించిన పోలీసులు తమదైన రీతిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. మృతుడి ప్రియురాలే భర్తతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే...శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన గురప్పకు వరదయ్యపాళెం కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో ఓ గదిని అద్దెకు తీసుకుని తరచూ అందులో కలుస్తుండేవారు. అయితే వీరి విషయాన్ని తెలిసిన మహిళ భర్త భార్యను గట్టిగా హెచ్చరించాడు. భార్యతో కలిసి అతడిని చంపడానికి పథకం రచించాడు.

 పథకం లో భాగంగా గురప్పను తాము రోజూ కలుసుకునే గదికి మహిళ రప్పించింది. ఆ వెంటనే ఈ విషయాన్ని ఫోన్ ద్వారా భర్తకు సమాచారమిచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న అతడు భార్య సాయంతో గురప్ప గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడినుండి ఎవరికంటా పడకుండా పరారయ్యాడు.

అయితే ఈ మహిళ గురప్పను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మృతుడి వివరాలను సేకరించిన పోలీసులు అతడికి అక్రమ సబంధం ఉందని గుర్తించారు.  ప్రియురాలిని తమదైన రీతిలో విచారించగా అసలు నిజాన్ని బైటపెట్టింది. దీంతో పోలీసులు ఈ భార్యాభర్తల్ని ఇవాళ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.   

loader