బ్రేకింగ్ : వైసిపి ఎంపిలను ఆసుప్రతికి తరలించిన పోలీసులు

First Published 11, Apr 2018, 12:37 PM IST
police shifted ycp MPs to hospital for treatment
Highlights
పోలీసులు దీక్షా శిబిరం నుండి బలవంతంగా రమ్మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యేకహోదా కోసం వైసిపి ఎంపిలు ఆరు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు బుధవారంతో ముగిసాయి. ఎందుకంటే, దీక్షలో ఉన్న మిగిలిన ఇద్దరు ఎంపిలను కూడా పోలీసులు దీక్షా శిబిరం నుండి బలవంతంగా రమ్మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

మంగళవారం ఉదయం నుండి వీరిద్దరి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అయినా వారు దీక్షను విరమించలేదు. వైద్యుల సలహా మేరకు ఈరోజు మధ్యాహ్నం పోలీసులు దీక్షా శిబిరం నుండి బయటకు తీసుకొచ్చేశారు.

ఇప్పటికే ముగ్గురు ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డిలపు పోలీసులు బలవంతంగా గతంలోనే దీక్షా శిబిరం నుండి ఆసుపత్రి తరలించిన విషయం తెలిసిందే.

ఉన్న ఐదుమంది లోక్ సభ సభ్యులుూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటంతో దీక్షల విషయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

 

 

loader