విశాఖలో మత్తు చాక్లెట్లు కలకలం రేపుతున్నాయి. చాక్లెట్ల ముసుగులో మత్తు పదార్ధాల అమ్మకాలు జరుగుతున్నాయి. విద్యార్ధులే టార్గెట్‌గా మత్తు మందు దందా సాగుతోంది.

పాన్ మసాలతో పాటు నల్లమందు చాక్లెట్ల విక్రయాలు చేస్తున్నారు వ్యాపారులు. పాన్ షాపుల్లో విచ్చలవిడిగా నల్లమందు చాక్లెట్ల విక్రయం జరుగుతోంది. నగరంలోని నేరేళ్ల కోనేరులో అధికారులు జరిపిన సోదాల్లో బంగ్ చాక్లెట్లు బయటపడుతున్నాయి.

వీటిని ఫుడ్ ఇన్స్‌పెక్టర్లకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్న పరిమాణంలో వుండే చాక్లెట్ల ధర రూ.100, రూ.500 ధరల్లో ఈ చాక్లెట్లు దొరుకుతున్నాయి. యువతనే టార్గెట్ చేస్తున్న ముఠాలు చాక్లెట్లతో ఎరవేస్తున్నారు.

విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. హరహర పాండా, మనోజ్‌కుమార్‌ చౌదరి, రాజీవ్‌ కుమార్‌ సింగ్‌లు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు.