ప్రత్యేకహోదా నిరసనలో భాగంగా బుధవారం వైసిపి నేతపై ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. జిల్లాలోని కొండిపి నియోజకవర్గం ఇన్చార్జి అశోక్ బాబుకు పోలీసులకు మధ్య రైల్వే స్టేషన్లో వాగ్వాదం జరిగింది.

దాంతో సిఐ గంగా ప్రసాద్ తో పాటు పలువురు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అశోక్ బాబును పోలీసులు ఇష్టమొచ్చినట్లు తిడుతూ కొట్టారు.

అంతేకాకుండా స్టేషన్లో నుండి వైసిపి నేతను ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి పోలీసు వాహనంలో పడేశారు. అశోక్ విషయంలో పోలీసుల ఎంత దురుసుగా ప్రవర్తించారో మీరే చూడండి