విశాఖపట్టణం: ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.వరలక్ష్మిని హత్య చేసేందుకు నిందితుడు అఖిల్ సాయి క్రైమ్ సినిమాలు చూశాడు. సినిమాలో చూపినట్టుగా హత్య నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు దొరికాడు.విశాఖపట్టణంలోని గాజువాకలో వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్ధినిని అఖిల్ సాయి అత్యంత దారుణంగా హత్య చేశాడు. 

also read:వరలక్ష్మి హత్య కేసు : వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండటాన్ని తట్టుకోలేకనే..

అక్టోబర్ 31వ తేదీ రాత్రి వరలక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. తనతో కాకుండా రాము అనే యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని నిందితుడు తట్టుకోలేక ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

ఈ మేరకు దృశ్యం సినిమాలో మాదిరిగా కేసు నుండి తప్పించుకొనేందుకు ప్లాన్ చేశాడు. హత్య చేసిన తర్వాత కారం చల్లితే తనను పట్టుకోవడం సాధ్యం కాదనుకొన్నాడు. హత్యకు ముందుగానే కారం కొనుగోలు చేశాడు.

also read:గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబానికి రూ. 10 లక్షలు: జగన్ ఆదేశం

వరలక్ష్మిని పథకం ప్రకారంగా నిర్మానుష్య  ప్రదేశానికి రప్పించాడు. ఆమెతో వాగ్వావాదానికి దిగి బ్లేడుతో కోసి చంపాడు. తన గురించి పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు గాను హత్య చేసిన ప్రదేశంలో కారం చల్లాడు.

దృశ్యం సినిమాలో మాదిరిగా హత్యను తప్పు దారి పట్టించేందుకు గాను ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి. నిందితుడితో కలిసి పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు.  ఇవాళ ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించి చార్జీషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.