శాంతి భద్రతలకు విఘాతం: పట్టాభి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ కు సంబంధించిన విషయంలో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు.పట్టాభిని అరెస్ట్ చేయకపోతే మరిన్ని బెదిరింపు ప్రకటనలు చేసే అవకాశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు Tdp అధికార ప్రతినిధి Pattabhiని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. పట్టాభి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు.ఏపీ సీఎం Ys Jaganపై బూతు వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న పట్టాభిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. పట్టాభికి కోర్టు నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. Remand reportలో పలు అంశాలను పోలీసులు ప్రస్తావించారు.
also read:పట్టాభికి 14 రోజుల రిమాండ్.. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ, కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు
పట్టాభిని అరెస్ట్ చేయకపోతే మరిన్ని బెదిరింపు ప్రకటనలు చేసే అవకాశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకే పట్టాభి రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజా సంఘాలు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.. పట్టాభి మాట్లాడిన భాష శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు.
ప్రభుత్వ పాలనకు అవమానం కలిగించేలా పట్టాభి మాట్లాడారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.రాష్ట్రంలో కులాల మధ్య శతృత్వాన్ని సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టాభి వ్యాఖ్యలకు మద్దతు తెలిపాయని Policeలు తెలిపారు. పట్టాభిపై ఇప్పటికే 4 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు ఈ రిపోర్టులో పేర్కొన్నారు. పట్టాభి స్టేట్మెంట్ కారణంగా అనేక అల్లర్లు జరిగాయి. పోలీసులపై కూడా హత్యాయత్నం చేసే స్థాయికి అల్లర్లు వెళ్లాయని పోలీసులు తెలిపారు.
మరో వైపు పట్టాభి బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ చేయనుంది. తన ఇంటిపై పలుమార్లు నిందితులు దాడిచేశారని పట్టాభి న్యాయమూర్తికి వివరించారు. Bail పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన ఈ ఘటనలను వివరించారు. తాను సీఎంని గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించలేదని వివరించారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే ప్రస్తావించానంటూ న్యాయమూర్తికి పట్టాభి వివరించారు.తాను విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ పరిశీలించాలంటూ న్యాయమూర్తిని పట్టాభి వేడుకున్నారు.