పట్టాభికి 14 రోజుల రిమాండ్.. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ, కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం నవంబర్ 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే పట్టాభి తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు

14 Days Remand For Arrested TDP leader Pattabhi Ram

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం నవంబర్ 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే పట్టాభి తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు గాను పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అంతకుముందు గురువారం విజయవాడలోని మూడో అడిషనల్ మెట్రోపాలిటిన్ కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. తన ఇంటిపై చాలా సార్లు దాడి చేశారని.. పట్టాభి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా వవిమర్శించలేదని.. ప్రభుత్వంలో వున్న లోపాలనే ప్రస్తావించానని పట్టాభి చెప్పారు. 

బుధవారం రాత్రి పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు .. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) అతడిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో pattabhi ని పోలీస్ వాహనాలను టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక వాహనంలో పట్టాభి తరలిస్తున్నట్లు తెలుసుకున్న TDP శ్రేణులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. తమకు పట్టాభిని చూపించాలంటు పోలీస్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని కాస్సేపు ఉద్రిక్తత ఏర్పడింది. 

ALso Read:పట్టాభిని హాస్పిటల్ కు తరలిస్తుండగా ఉద్రిక్తత... అడ్డుకున్న టిడిపి శ్రేణులు... ఈడ్చుకెళ్లిన పోలీస్ బలగాలు

ఇదిలావుంటే టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా అమరావతికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ఎమ్మెల్యేగా సెక్రటేరియట్ కు వెళుతున్నానని...ఎందుకు అడ్డుకుంటున్నారని గోరంట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల సమస్య వుంది కాబట్టి పంపించడం లేదంటూ ఏలూరు వద్ద gorantla butchaiah ను పోలీసులు అడ్డుకున్నారు.

బుధవారం రాత్రి kommareddy pattabhi ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను భారీ బందోబస్త్ మధ్య పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకువచ్చి అరెస్ట్ చేసారని ఆమె ఆరోపించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి భార్య కూడా ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని ఆమె హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని... ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె తెలిపారు. మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios