శుక్రవారం ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకులందరూ ‘ఓటుకు నోట్లు’ పంచుతున్నపుడే పోలీసులు అరెస్టులు చేయటం గమనార్హం. ఎప్పుడైతే యువకులు పట్టుపడ్డారో వెంటనే టిడిపి, వైసీపీలు ఒకదానిపై మరో పార్టీ ఆరోపణలు మొదలుపెట్టింది. ‘పట్టుబడ్డ వారు మీ పార్టీ వారే అంటే కాదు మీ పార్టీ వారే’ అంటూ మీడియాకెక్కారు.

నంద్యల ఉపఎన్నికలో డబ్బుల పంపిణీ వ్యవహారం చివరి అంకానికి చేరుకుంటోంది. శుక్రవారం ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు పంపిణీ చేస్తుండగా పోలసులు పట్టుకోవటం బహుశా ఇదే మొదటిసారేమో. యువకులందరూ ‘ఓటుకు నోట్లు’ పంచుతున్నపుడే పోలీసులు అరెస్టులు చేయటం గమనార్హం. ఎప్పుడైతే యువకులు పట్టుపడ్డారో వెంటనే టిడిపి, వైసీపీలు ఒకదానిపై మరో పార్టీ ఆరోపణలు మొదలుపెట్టింది. ‘పట్టుబడ్డ వారు మీ పార్టీ వారే అంటే కాదు మీ పార్టీ వారే’ అంటూ మీడియాకెక్కారు.

ఈ రోజు ఉదయం 28 మంది యువకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు స్ధానికులే పోలీసులకు సమాచారం అందించారట. డబ్బుల పంపిణీలో తలెత్తిన విభేదాలే యువకులను పోలీసులకు పట్టించిందని ఓ సమాచారం. యువకులు ముందు ఓ ఏరియాలో ఓటుకు రూ. 2 వేల ఇచ్చారట. అయితే, తర్వాత మరో ఏరియాకు వచ్చినపుడు మాత్రం ఓటు విలువను బాగా తగ్గించేసారట. దాంతో యువకులకు, ఓటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందట. దాంతో ఒళ్ళు మండిన స్ధానికులే పోలీసులకు ఫోన్ చేసి యువకల వ్యవహారాన్ని పోలీసులకు తెలిపారు.

సరే, పట్టుబడిన వారందరూ తమ పార్టీ వారే అని ఎవరైనా చెబుతారా? అందుకే యువకులకు తమ పార్టీకి సంబంధం లేవని రెండు పార్టీలూ చేతులు దులుపుకుంటున్నాయి. దానికి తోడు పోలీసులు కూడా ఈ విషయమై మాట్లాడటం లేదు. దాంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. పట్టుబడిన వారందరూ వైసీపీకి చెందిన వారే అయితే ఈ పాటికి మంత్రులు, నేతలు ఊరికే ఉండేవారా?

యువకులు పట్టుబడిన విషయం తెలీగానే వైసీపీ ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీస్టేషన్ కు వెళ్ళారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పట్టుబడిన 28 మందిలో కేవలం 4గురు మాత్రమే తమ మనుషులని అదికూడా ఖర్చుల కోసం డబ్బు ఉంచుకుంటే వారిని అదుపులోకి తీసుకోవటం అన్యాయమన్నారు. అంతాబాగానే ఉందికానీ ఇంతకీ పట్టుబడిన వారు ఎవ్వరనే విషయాన్ని పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.