పశ్చిమగోదావరి జిల్లాలోని అచంటలో పోలీసుల ఓవరాక్షన్‌ కలకలం రేపింది. శివరాత్రి వేడుకల్లో యువతులను ఈవ్‌టీజింగ్‌ చేశారని కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి విచారణ చేయకుండానే వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతటితో అగకుండా పీఎస్‌లోనే ఆ యువకులపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.