అమరావతి: ఛలో అసెంబ్లీని పురస్కరించుకొని టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అసెంబ్లీని ముట్టడించేందుకు అమరావతి జేఎసీ పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి టీడీపీ మద్దతు ఇచ్చింది.  దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.

Also read:అసెంబ్లీ సమావేశాలకు అటంకం కలిగిస్తే కఠిన చర్యలు: గుంటూరు ఐజీ హెచ్చరిక

విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకుడు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also read:వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

మరో వైపు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  ఛలో అసెంబ్లీ నేపథ్యంలో  పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఈ చర్యల్లో భాగంగానే  పోలీసులు టీడీపీకి చెందిన  ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు.