బంధువులకు కీర్తన అప్పగింత: నిందితుడు సురేష్ కోసం పోలీసుల గాలింపు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వంతెన నుండి సుహాసిని ఆమె పిల్లలను తోసేసిన సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Police handed over keertana to relatives lns


రాజమండ్రి: కోనసీమ జిల్లా రావులపాలెం  గోదావరి వంతెన వద్ద  రక్షించిన బాలిక కీర్తనను  పోలీసులు బంధువులకు అప్పగించారు.  మరో వైపు  గోదావరి నదిలో కీర్తన ఆమె తల్లిని, మరో చిన్నారిని తోసేసిన సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.పథకం ప్రకారం సుహాసినిని పిల్లలను చంపేందుకు  ప్రయత్నించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.  గోదావరి నదిలో  వారిని తోసేసిన సురేష్ పారిపోయాడు. సురేష్ కోసం  ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.  

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన  సుహాసిని  భర్తతో విడిపోయింది. తన కూతురు కీర్తనతో  నివసిస్తుంది.  ఆమెకు  ప్రకాశం జిల్లా దర్శికి  చెందిన  సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సహజీవనానికి దారి తీసింది. దీంతో వీరిద్దరికి ఓ  చిన్నారి జన్మించింది. ఈ చిన్నారికి జెర్సీ అని పేరు పెట్టారు. అయితే వీరి మధ్య  విబేధాలు వచ్చాయి. 

also read:13యేళ్ల బాలిక సాహసం.. గోదావరిలో తోసేస్తే పైప్ పట్టుకుని ప్రాణాలు దక్కించుకుంది.. ఏమైందంటే....

 దీంతో  సుహాసినిని ఆమెను, పిల్లలను చంపాలని  సురేష్ ప్లాన్ చేశాడు.  శనివారం నాడు  రాజమండ్రి తీసుకెళ్లాడు. ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు  కారులో  సుహాసినిని  పిల్లలను తిప్పాడు. రావులపాలెం పాత వంతెన వద్దకు ఆదివారంనాడు తెల్లవారుజామున వారిని తీసుకు వచ్చాడు సురేష్.  సెల్ఫీ తీసుకుందామని చెప్పి  పిల్లలతో సహా సుహాసినిని  నదిలోకి నెట్టారు.  అయితే  సుహాసిని, జెర్సీ నదిలో పడిపోయారు. అయితే కీర్తన మాత్రం  కేబుల్ పైప్ ను పట్టుకొని  బతికింది.  తన వద్ద ఉన్న ఫోన్ తో ఆ బాలిక  పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు బాలికను రక్షించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios