ఏఓబీలో మావోలు, పోలీసుల మధ్య కాల్పులు: తప్పించుకొన్న నక్సల్స్

ఆంధ్రా- ఒడిశా రాష్ట్రంలో  మావోలు, పోలీసుల మధ్య బుధవారంనాడు ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకొన్నారు.ఒడిశా రాష్ట్రంలో తులసిపాడు అటవీప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Police exchange fire with Maoists in Andhra Odisha Border

విశాఖపట్టణం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్(aob) లో బుధవారం నాడు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసులపై(police) కాల్పులు జరుపుతూ మావోయిస్టులు (maoist)తప్పించుకొన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 ఒడిశా రాష్ట్రంలోని  మల్కన్ గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని  మావోల కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.  అయితే నక్సల్స్ కదలికలపై పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది.

 

 

ఈ సమాచారం ఆధారంగా  కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. పోలీసులపై  కాల్పులు జరుపుతూ మావోయిస్టులు పారిపోయాయని పోలీసులు ప్రకటించారు.తులసిపాడు అటవీ ప్రాంతంలో డీవీఎఫ్, ఎస్ఓజీ బలగాలు చేరుకొని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఏఓబీకి మావోలకు పట్టుంది. ఏఓబీని అడ్డాగా చేసుకొని విశాఖ ఏజెన్సీలో మావోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో మావోల్లో రిక్రూట్ మెంట్  తగ్గిపోయిందని పోలీసులు ప్రకటించారు. రిక్రూట్ మెంట్ కోసం పోలీసురలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios