ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున డ్రంకన్ డ్రైవ్‌లో మద్యం సేవించి బస్సును నడుపుతున్న పలువురు డ్రైవర్లు అడ్డంగా బుక్కయ్యారు.

ముగ్గురు డ్రైవర్లు మోతాదుకు మించి మద్యాన్ని సేవించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంకట పద్మావతి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, కనకదుర్గ ట్రావెల్స్‌లకు చెందిన డ్రైవర్లుగా గుర్తించారు.

డ్రైవర్ల బాగోతం బట్టబయలు కావడంతో ప్రయాణికులంతా షాక్‌కు గురయ్యారు. మద్యం తాగి బస్సు నడపడం ఏంటని డ్రైవర్లపై ప్రయాణికులు మండిపడ్డారు.