ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయ‌రామ్ అనుమానాస్పద మృతిని హత్యగా నిర్ధారించారు పోలీసులు. తెల్లవారుజామున హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలోని కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా అంచనాకు వచ్చిన పోలీసులు తర్వాత ఘటనాస్థలంలోని ఆధారాలు, తలపై గాయాలు వంటి కారణాలతో హత్యగా నిర్ధారించారు. కుటుంబ, వ్యాపార సంబంధమైన కారణాలే ఆయన హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సూర్యాపేట, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న పోలీసులు కారును ఓ తెలుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నడిపినట్లు గుర్తించారు. జయరామ్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.. ప్రస్తుతం ఆయన అమెరికా పౌరసత్వాన్ని కలిగివున్నారు. 

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు