విశాఖపట్నంలోని పెందుర్తిలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చోటుచేసుకుంది. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగుచూసింది.
విశాఖపట్నంలోని పెందుర్తిలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చోటుచేసుకుంది. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగుచూసింది. ఈ ఘరానా మోసంలో వైసీపీ మహిళా నాయకురాలు హస్తం ఉంది. వివరాలు.. మీసాల విజయలక్ష్మి అనే మరికొందరితో కలిసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశచూపి భారీగా డబ్బులు దండుకుంది. తమకు అమరావతి సచివాలయంలో తెలిసినవారు ఉన్నవారిని నమ్మబలికింది. రైల్వే, వీఆర్వో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ కల్పించింది. ఈ విధంగా ఆరుగురిని బురిడీ కొట్టించింది. వారి నుంచి దశలవారీగా రూ. 28 లక్షల వరకు వసూలు చేసింది.
అయితే నెలలు గడస్తున్న ఉద్యోగాలు రాకపోవడంతో.. ఆమెకు డబ్బులు చెల్లించినవారు మోసపోయామని గ్రహించారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మీసాల విజయలక్ష్మితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మీసాల విజయలక్ష్మి వైసీపీ మహిళా నేత అని బాధితులు చెబుతున్నారు. ఆమెకు అధికార పార్టీ నాయకులతో పరిచయాలు ఉన్నాయని విజయలక్ష్మి చెప్పేదని తెలిపారు.
