తాజాగా తాడిపత్రి ఎంఎల్ఏ జెసి దివాకర్ రెడ్డిపైన కూడా పోస్టులు పెట్టారంటూ మరో కేసు నమోదైంది. అయితే, తాజా కేసులో ఇప్పాలపై కేసు పెట్టింది ఎంఎల్ఏ కాదు, జడ్పిటిసి సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పాల రవీంద్రపై పోలీసులు మరో కేసు నమోదు చేసారు. అంటే నెటిజన్లపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధించటం మానటం లేదన్న మాట. పాయకాపురం ఎంఎల్ఏ అనితపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ఇప్పాలపై గతంలోనే ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ కేసులోనే ఇప్పాల విశాఖజైలులో ఉన్నారు.

తాజాగా తాడిపత్రి ఎంఎల్ఏ జెసి దివాకర్ రెడ్డిపైన కూడా పోస్టులు పెట్టారంటూ మరో కేసు నమోదైంది. అయితే, తాజా కేసులో ఇప్పాలపై కేసు పెట్టింది ఎంఎల్ఏ కాదు, జడ్పిటిసి సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. దాంతో రవీంద్రను విశాఖ జైలు నుండి తాడిపత్రి జైలుకు తరలించారు. కాసేపట్లో తాడిపత్రి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు,

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వంపై ఎవరు కూడా వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు పెట్టకూడదన్నట మాట. ఇప్పాలపై కేసు పెట్టటాన్ని వ్యతిరేకిస్తూ తాడిపత్రిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరోవైపు కోర్టు, పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గతంలో పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ పై కూడా కేసు పెట్టి వేధిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ప్రభుత్వం కేసులు పెట్టేకొద్దీ నెటిజన్లు మరింత రెచ్చిపోతున్నారు.