వైసీపీ మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ పిలుపులో భాగంగా  ప్రత్యేక హోదా కోసం గతంలో జరిగిన ఉద్యమంలో ఎంఎల్ఏ ఉద్యమంలో పాల్గొన్నారు. దాంతో పోలీసులు ఆళ్ళపై కేసు నమోదు చేసారు. ఒక్క ఎంఎల్ఏ పైనే కాకుండా మరో 15 మంది వైయస్సార్ సీపీ నాయకులపై  కూడా కేసులు  పెట్టారు. ఆ కేసుకు సంబంధించిన మొదటి వాయిదాకు ఆళ్ళ హాజరయ్యారు. కాగా మార్చి 7వ తేదీకి కేసును న్యాయస్ధానం వాయిదా వేసింది.

అయితే, తనపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసారని ఎంఎల్ఏ ఆరోపించారు. శాంతియుతంగా జరిగిన ఆందోళనపై పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అప్పటి తమ ఆందోళనలో ఎటువంటి హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకోలేదని గుర్తు చేస్తున్నారు. అయినా తమపై కేసులు పెట్టారంటే కేవలం పై స్ధాయిలో నుండి వచ్చిన ఆదేశాలతోనే స్ధానిక పోలీసులు కేసులు నమోదు చేసారని ఎంఎల్ఏ అంటున్నారు. చంద్రబాబునాయుడుపై తాను కోర్టుల్లో కేసులు వేయటంతో ఎవరో కావాలనే తనపైన కూడా కేసు నమోదు చేయించినట్లు ఆళ్ళ అనుమానం వ్యక్తం చేసారు.