Asianet News TeluguAsianet News Telugu

దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ.. యూట్యూబ్ లో చూసి....

ఆ నోటును పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అప్రమత్తమై నూర్ బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ. వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది

Police Arrested Fake Currency Notes Printing Gang in Guntakal
Author
Hyderabad, First Published Sep 28, 2021, 10:16 AM IST

గుంతకల్ : యూట్యూబ్ (youtube)లో చూసి గుంతకల్లు(Guntakal)కేంద్రంగా దొంగనోట్లు (Fake Currency) తయారు చేసి అక్రమంగా చలామణి చేసిన ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్ భాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్ పకోడి (chicken pakodi) కొనుగోలు చేసి రూ. వందనోటు ఇచ్చాడు.

ఆ నోటును పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ అప్రమత్తమై నూర్ బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ. వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది. దీంతో నూర్ బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

వైసీపీ గ్రాఫ్ పడిపోయింది.. ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్..!

అక్కడ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో దొంగనోట్ల తయారీ గుట్టు రట్టయ్యింది. యూట్యూబ్ ద్వారా నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ. 50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను అందజేయడంతో పాటు స్వయంగా తాము కూడా మార్కెట్ లో చలామణి చేసినట్లు తెలిపాడు. 

శనివారం రాత్రి నిందుతుడు నూర్ బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి జొన్నగిరి పోలీసులు చేరుకున్నారు. అతని ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నూర్ బాషాకు సహకరంచిన ఖాజా, ఎన్.ఖాసీంను అరెస్ట్ చేసి సోమవారం కర్నూలు జిల్లా కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios