చిత్తూరు జిల్లా నగరి  మాజీ మున్సిఫల్ కమిషనర్ బాలాజీ యాదవ్  బస్టాండ్‌లో ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. ప్రయాణీకులు అతడిని పోలీసులకు అప్పగించారు. 

చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి మాజీ మున్సిఫల్ కమిషనర్ బాలాజీ యాదవ్ బస్టాండ్‌లో ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. ప్రయాణీకులు అతడిని పోలీసులకు అప్పగించారు.

చిత్తూరు జిల్లా తిరుపతి బస్టాండ్‌లో ఓ అమ్మాయిని బాలాజీ యాదవ్ వేధింపులకు గురి చేశాడు. ఈ వేధింపులకు గురి చేయడంతో స్థానికులు గుర్తించి దేహశుద్ది చేశారు.

పుత్తూరులో విద్య వలంటీర్‌గా పనిచేస్తోంది. తిరుపతిలో నివాసం ఉంటుంది. శనివారం సాయంత్రం పుత్తూరులో విధులు ముగించుకొని తిరిగి వచ్చిన సమయంలో బస్టాండ్‌లో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆరు మాసాలుగా నీ వెంట తిరుగుతున్నా నా గురించి పట్టించుకోవడం లేదంటూ ఆమెను ఇబ్బందిపెట్టాడు. అయితే ఈ విషయమై బాధితురాలు తనకు పెళ్లి కుదిరింది. ఇబ్బంది పెట్టొద్దని ప్రాధేయపడింది. కానీ, అతను మాత్రం వెనక్కు తగ్గలేదు.

నిందితుడు వేధింపులు భరించలేక బాధితురాలు ఏడ్వడాన్ని గుర్తించిన స్థానికులు బాలాజీ యాదవ్ ను చితకబాదారు. పోలీసులకు సమాచారామిచ్చారు. నగరి మున్సిఫల్ కమిషనర్‌గా పనిచేసిన బాలాజీ యాదవ్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు.

 గతంలో కూడ ఆయనపై ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. ఓ లేడి కానిస్టేబుల్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలాజీ యాదవ్ పై ఆరోపణలు ఉన్నాయి. భార్యపై హత్యాయత్నం కేసు కూడ ఆయనపై ఉంది.తిరుపతి ఈస్ట్ పోలీసులు బాలాజీ యాదవ్ ను మందలించి వదిలేశారు.