Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : హుండీ దొంగతనం చేసింది బాలలే.. దొంగల్లో అమ్మాయి కూడా..

భీమవరం జిల్లా, ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో మైనర్లే నిందితులని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే వీరిలో ఓ బాలిక కూడా ఉండడం విశేషం. 

Police arrest two minors in Hundi theft case in bheemavaram - bsb
Author
Hyderabad, First Published Oct 8, 2020, 11:36 AM IST

భీమవరం జిల్లా, ఉండి మండలం చిలుకూరు గ్రామం పైలమ్మ అమ్మవారి గుడి హుండీ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో మైనర్లే నిందితులని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే వీరిలో ఓ బాలిక కూడా ఉండడం విశేషం. 

ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగింది. హుండీ పగలగొట్ట నగదు దోచుకెల్లారు. చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యుడు రుద్రరాజు శివ ఫిర్యాదు చేశారు. భీమవరం రూరల్‌ సీఐ ఎం.శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. గుడి వద్ద సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు మైనర్లు మోటారు సైకిళ్లపై వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిలో ఒక బాలిక కూడా ఉండటం విశేషం. వీరంతా బాల నేరస్తులే. భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. 

వీరిలో ఇద్దరు బాలనేరస్తులను బుధవారం ఉండి మెయిన్‌ సెంటర్‌లో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తు రూ. 8 వేలు రికవరీ చేశారు. వీరిని విచారించగా మరో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

చెడు వ్యసనాలకు అలవాటుపడి రాత్రిపూట భీమవరం పరిసర గ్రామాల్లోని గుళ్లలో హుండీల్లోని నగదు చోరీ చేసి జల్సా చేస్తున్నారు. వీరిపై గతంలో భీమవరం వన్‌టౌన్, ఆకివీడు, వీరవాసరం, గుడివాడ వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దొరికిన ఇద్దరూ మైనర్లు కావడంతో ఏలూరు జువైనల్‌ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఉండి ఎస్సై అప్పలరాజును, ఇరువురు కానిస్టేబుళ్లను ఎస్పీ నారాయణ నాయక్‌ అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios