ఓ వ్యక్తి స్నేహానికే ద్రోహం చేశాడు. స్నేహితుడి భార్యపై కన్నేశాడు. పుట్టింట్లో ఉన్న సదరు మహిళకు మాయ మాటలు చెప్పి తీసుకువచ్చి.. అనంతరం కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఏలూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు రామకృష్ణాపురంలోని ఒక ఆస్పత్రి సమీపంలో అద్దెకు ఉంటున్న కారు డ్రైవర్‌ పల్లి నానిబాబు, మరో డ్రైవర్‌ స్నేహితులు. నానిబాబుకు అతని భార్యతో మనస్పర్థలు రావడంతో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒక గదిలో అద్దెకు ఉంటున్నా డు. ఈ క్రమంలో అతని స్నేహితుడి భార్యపై కన్నేశాడు.

ఈ నెల 9న ఆమె ద్వారకా తిరుమలలోని పుట్టింటికి వెళ్లింది. స్నేహితుడు కిరాయి నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. ఇదే అద నుగా భావించిన నానిబాబు ఈ నెల 11వ తేదీ ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నిన్ను నీ భర్త తీసుకురమ్మని చెప్పాడు. నేను కిరాయికి భీమడోలు వచ్చాను’ అని నమ్మబలికాడు. 

మరో డ్రైవర్‌ వాసాది కాశీ(31) సహకారంతో ఆమెను కారులో ఏలూరులోని నానిబాబు గదికి తీసుకొచ్చి బంధించి అత్యాచారానికి పాల్ప డ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన ఆమె భర్త వచ్చి భార్యను విడిపించి తీసుకెళ్లాడు. బాధితురాలు త్రీటౌన్‌ పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మూర్తి కేసు నమోదు చేశా రు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులైన నాని బాబు, కాశీలను అరెస్ట్‌ చేసి కారును సీజ్‌ చేశారు.