విశాఖపట్నం: మహిళా ఎమ్మార్వోను దూషించిన కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, అయ్యన్నపాత్రుడు విజయవాడలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, అయ్యన్నపాత్రుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Also Read: పుకార్లు: ఏ క్షణంలోనైనా అయ్యన్నపాత్రుడి అరెస్టు

తనను అసభ్య పదజాలంతో తిట్టారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

మున్సిపల్ కమిషనర్ ను దూషించిన అయ్యన్నపాత్రుడిని వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు మహిళా మున్సిపల్ కమిషనర్ ను దూషించిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. మహిళా కమిషనర్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అందులో రికార్డయ్యాయి.

Video: టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు