అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పార్లమెంట్‌లో వేసిన ప్రశ్నకు  కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.

పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోపుగా పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుజనా చౌదరి ప్రశ్నించారు.  కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021లోపుగా పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. 

ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 3047 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.అయితే  ఇందులో  కేంద్ర ప్రభుత్వం 1440 కోట్లను  ఇచ్చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాము ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టును అందిస్తేనే నిధులను విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 నవంబర్ 26వ తేదీన కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి  తేల్చి చెప్పిందని  సుజనాకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.