ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒకేసారి 14 ప్రాజెక్ట్‌లకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 12న విశాఖలో పలు పథకాలకు మోడీ శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని హోదాలో మోడీ విశాఖ రావడం ఇది మూడోసారి. 11వ తేదీ విశాఖలో ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌లు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయన తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయానికి చేరుకుని, ఐఎన్ఎస్‌ చోళాలో బస చేస్తారు. తర్వాతి రోజు (నవంబర్ 12న) ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌కు చేరుకుని అక్కడి సభలో పాల్గొని ప్రసంగిస్తారు మోడీ. ఈ సందర్భంగా ఒకేసారి 14 ప్రాజెక్ట్‌లకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

కాగా.. నవంబర్ 11న మోడీ తెలంగాణలోనూ పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కార్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు. మూతపడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి నిర్మించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం రూ.6,120 కోట్లు వెచ్చించింది.